గర్భవతులు ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవించాలని అదే సురక్షితం అని బైర్లూటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ గోపాల్, డాక్టర్ పవన్ కుమార్ అన్నారు. ఆత్మకూరు మంగళవారం మండల పరిధిలోని బైర్లూటి ప్రాథమిక కేంద్రంలో ప్రధానమంత్రి మాతృత్వ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గర్భవతులకు చికిత్సలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆరోగ్య ఆశ కార్యకర్తలు గర్భవతులు తదితరులు పాల్గొన్నారు.