రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని, దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఆపాలని, హిందూ దేవాలయాలపై జాతీయ స్థాయిలో సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని హైందవ శంఖారావం ప్రతినిధులు ఎం. వేణుగోపాల్, జి సత్యనారాయణ శర్మ, లక్ష్మీనారాయణ ఆచార్యులు పేర్కొన్నారు. ఆదివారం నాడు సాయంత్రం ఆత్మకూరు పట్టణంలోని జి పుల్లారెడ్డి స్కూల్ నందు మండల స్థాయి హిందూ సమ్మేళన కార్యక్రమం జరిగింది.