భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుక

77చూసినవారు
భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుక
బండి ఆత్మకూరు మండలంలోని పెద్ద దేవలాపురం గ్రామ శివారులలో వెలసిన ఏకశిలా అభయాంజనేయ స్వామి ఆలయంలో శనివారం హనుమాన్ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి స్వామివారికి అభిషేకాలు, అర్చనలు తదితర పూజా క్రతువులు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తుల తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

సంబంధిత పోస్ట్