మన దేవాలయాలను మనమే రక్షించకుందామని నిత్యానంద భారతి స్వామి తెలిపారు. ఆదివారం సాయంత్రం మహానంది మండలం బుక్కాపురం గ్రామంలోని రామాలయంలో హైందవ శంఖారావం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ దేవాలయాలలో అన్యమతస్తులను తొలగించాలని, హిందువులే ఉద్యోగం నిర్వహించాలన్నారు. వచ్చేనెల జనవరి 5వ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంఖారావం భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు.