శ్రీశైలంలో వాటర్ ఎయిర్ డ్రోమ్ పరిశీలించిన కలెక్టర్

80చూసినవారు
శ్రీశైలంలో వాటర్ ఎయిర్ డ్రోమ్ పరిశీలించిన కలెక్టర్
నవంబర్ మాసం రెండు లేదా మూడో వారంలో సీప్లేన్ ద్వారా ట్రయల్ రన్ నిర్వహించే అవకాశం ఉందని అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం శ్రీశైలంలోని పాతాళ గంగ వద్ద వాటర్ ఎయిర్ డ్రోమ్ ల్యాండ్ అయ్యే బోటింగ్ పాయింట్ ను కలెక్టర్ పరిశీలించారు. ఆత్మకూరు ఆర్డీఓ ఎం. దాసు, డ్యామ్ ఎస్ఈ రామచంద్రరావు, డిఎఫ్ఓలు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్