శ్రీరామ జన్మస్థలమైన అయోధ్య నుంచి ప్రత్యేకంగా ఆత్మకూరుకు పంపించబడిన బాలరాముడి అక్షింతలను మంగళవారం ఆయా గ్రామాల నిర్వాహకులకు విశ్వహిందూ పరిషత్ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణ పురోహితులు సత్యనారాయణ శర్మ మాట్లాడుతూ జనవరి 22వ తేదీన అయోధ్య రామాలయంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకుని హిందూ బంధువులందరికీ అక్షింతలు పంపించడం జరిగిందని తెలిపారు.