ఘనంగా అక్కమహాదేవి జయంతోత్సవం

54చూసినవారు
శ్రీశైలంలో మల్లికార్జునస్వామి పరమ భక్తులలో ఒకరైన శివశరణి అక్కమహాదేవి జయంతోత్సవం మంగళవారం దేవస్థానం సాంప్రదాయబద్ధంగా నిర్వహించింది. జయంతోత్సవం సందర్భంగా అర్చకులు ఆలయ ఈవో పెద్దిరాజు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి విగ్రహానికి పంచామృత, జలాభిషేకలు నిర్వహించారు ముందుగా జయంతోత్సవ సంకల్పాన్ని పఠించి, మహాగణపతి పూజ, మల్లికా గుండంలోని శుద్ధ జలాలతో, జలాభిషేకం, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్