ఈ నగరంలో అడుగుపెట్టాలంటే టికెట్ కొనాల్సిందే..

57చూసినవారు
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే టికెట్ కొనాల్సిందే..
ప్రపంచంలోని అత్యంత అందమైన నగరాల్లో ఇటలీలోని వెనిస్ ఒకటి. 100కు పైగా దీవులుగా విస్తరించిన ఈ నగరంలోని కాలువలపై పడవ విహారం సందర్శకులకు మరిచిపోలేని అనుభూతి ఇస్తుంది. దీంతో ఏటా పెద్దఎత్తున పర్యటకులు ఇక్కడికి పోటెత్తుతుంటారు. ఈ నేపథ్యంలోనే నగర సందర్శనకు వచ్చేవారి సంఖ్యను కట్టడి చేసేందుకు స్థానిక యంత్రాంగం సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.

సంబంధిత పోస్ట్