శ్రీశైలం మల్లన్న ఆలయ హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. ఉభయ దేవాలయాలు, పరివార దేవాలయాల హుండీలను చంద్రావతి కళ్యాణ మండపంలో భద్రత, నిఘా మధ్య ఆలయ అధికారులు సిబ్బందితో పాటు శివసేవకులు మంగళవారం లెక్కించారు. గత 28 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలు నగదు రూపంలో రూ. 4, 14, 15, 623 నగదు, 322 గ్రా బంగారం, సుమారు 8.5 కేజీల వెండిని భక్తులు కానుకల రూపంలో సమర్పించారు.