శ్రీశైలం క్షేత్రంలోని పాతాళగంగ పాతమెట్ల మార్గంలో ఆదివారం అర్ధరాత్రి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఇద్దరు వ్యక్తులు గాజు సీసాతో అశోక్ అనే వ్యక్తి గొంతు కోసి హత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం అశోక్ ని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా తరలించగా అప్పటికే మృతి చెందాడు. పోలీసులు హత్య చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.