సంగమేశ్వరంలో సోమవార పూజలు

56చూసినవారు
సంగమేశ్వరంలో సోమవార పూజలు
కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వర క్షేత్రంలో సోమవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ గర్భాలయంలోని వేపదారు శివలింగానికి వివిధ రకాల అభిషేకాలు అర్చనలు తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణంలోని ఉప ఆలయాల్లో కూడా యధావిధిగా పూజలు కొనసాగించారు. సోమవారం స్వామివారికి ప్రీతికరం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్