కుంభోత్సవం సందర్భంగా ముస్తాబైన అమ్మవారి ఆలయం

1054చూసినవారు
శ్రీశైల భ్రమరాంబ దేవికి శుక్రవారం శాస్త్రోక్తంగా కుంభోత్సవాన్ని నిర్వహించనున్నారు. సాత్విక బలిగా అమ్మవారికి గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నరాసిని సమర్పించేందుకు అధికారులు సిద్ధం చేశారు. ఈ మేరకు అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో ముస్తాబు చేశారు. సంప్రదాయాన్ని అనుసరించి స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభ హారతిని సమర్పించడంతో ఉత్సవంలో ప్రధానఘట్టం ప్రారంభమవుతుంది.

సంబంధిత పోస్ట్