కర్నూలు జిల్లా వెలుగోడు పట్టణంలోని జండా వీధిలో అగ్ని ప్రమాదం జరిగింది దర్గయ్య అనే రైతుకు చెందిన 4 గడ్డివాములు దగ్ధం అయ్యాయి సుమారు లక్ష రూపాయలు విలువ మేర ఆస్తి నష్టం జరిగింది. అగ్నిమాపక దళానికి ఫోన్ చేసిన సకాలంలో రాకపోవడంతో పశువుల నోటికాడి మేత మంటల్లో కాలి పోతుండటం చూసి చుట్టుపక్కల ప్రజలు ఆరైతుకు సహాయపడి కొంత గడ్డిని వేరుచేసి సురక్షిత ప్రాతంలోకి చేర్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది.