జాతీయ క్రీడా దినోత్సవంతో పాటు తెలుగు భాష దినోత్సవం గోనెగండ్ల ఏపీ మోడల్ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్చంద్ చిత్రపటానికి తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటాలకు గోనెగండ్ల సీఐ గంగాధర్ పాఠశాల ప్రిన్సిపల్ షాహిన పర్వీన్ పూలమాలలతో నివాళులర్పించారు.