ఎమ్మిగనూరు: కోటేకల్లు గ్రామంలో ఏఎస్ఎం వేణుగోపాల్, నవీన్ వరప్రసాద్ సురేఖ ఆధ్వర్యంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో బయోస్టాట్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు సాయం చేయాలనే ఆలోచనతో గురువారం పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందచేశారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మేలు కోసం ఒక్కో విద్యార్థికి 2500 రూపాయలు చొప్పున 10 మంది విద్యార్థులను ఎంచుకొని వారికి 25 వేల రూపాయల స్కాలర్ షిప్ అందజేశారు.