కర్నూలు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ హామీతో సోమవారం ఎమ్మిగనూరులో చేపట్టాల్సిన బంద్ ను విరమించుకున్నట్లు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తెలిపారు. ఆదివారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం పార్లపల్లెలో సాగునీటి సంఘం ఎన్నికల్లో అధికార పార్టీ నేతల దౌర్జన్యాలను ప్రశ్నించేందుకు వెళ్లిన తనను సీఐ ఇబ్రహీం ధూషించడం సరికాదన్నారు. సీఐపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారన్నారు.