ఇసుక అక్రమంగా తరలిస్తున్న వాహనాలపై రెవెన్యూ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్ ఆదేశాల మేరకు తహసీల్దార్ శ్రీనివాసులు నందవరం, నాగలదిన్నె గ్రామాల సమీపంలో ఇసుక అక్రమ తరలింపుపై నిఘా పెట్టి, ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఎమ్మిగనూరుకు చెందిన ఐదు ట్రాక్టర్లను పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లను పోలీసుల ఆధ్వర్యంలో స్టేషన్ కు తరలించారు.