గోనెగండ్లలో వెలసిన శ్రీచింతలముని నల్లారెడ్డి స్వాముల దశమి ఉత్సవాలు సందర్బంగా.. రాష్ట్రస్థాయి ఒంగోలు ఎద్దుల బలప్రదర్శన చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఎద్దుల బల ప్రదర్శన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. 23 ఉదయం 8 నుంచి 24వ తేదీ సాయంత్రం 5 వరకు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ట్రాక్టర్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే బీవీ ఈ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు తెలిపారు.