ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సంస్థ చేపట్టే జాబ్ మేళాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్ అన్నారు. శుక్రవారం ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో నిరుద్యోగులు వివిధ కంపెనీలకు 62 మంది ఎంపికయ్యారని వారికి అర్హత పత్రాలు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో ప్లేస్మెంట్ అధికారి సాయి తేజ, సిబ్బంది శ్రీనివాసులు పాల్గొన్నారు.