కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పూజల్లో పాల్గొన్న భక్తురాలు సోమవారం ఉదయం ఎమ్మిగనూరు మండలం బూదూరు గ్రామానికి బయలుదేరగా కోసిగి మండలం చింతకుంట గ్రామం వద్ద స్పృహ తప్పి బైక్ మీద నుండి కిందపడి తలకు బలమైన గాయం అయ్యింది. దీంతో ఆమె స్పృహ లేకుండా పడిపోయింది. చుట్టుపక్కల ఉన్న కొంతమంది ఆమెను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.