ఏపీ ప్రభుత్వానికి మద్యం షాపుల యాజమానుల హెచ్చరిక

80చూసినవారు
ఏపీ ప్రభుత్వానికి మద్యం షాపుల యాజమానుల హెచ్చరిక
AP: మద్యం కమిషన్ పెంచకపోతే లైసెన్స్ ఫీజు కట్టలేమని మద్యం షాపుల యజమానులు అంటున్నారు. కడపలో నేడు సమావేశమైన వారు మద్యం అమ్మకాల కమిషన్‌పై చర్చించారు. ప్రభుత్వం ప్రకటించిన 20 శాతం కమిషన్ ఇస్తే తప్ప షాపులు నడపలేమన్నారు. దీనిపై ఈ నెల 5న ఎక్సైజ్ కమిషనర్‌కు నోటీసులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 14 లోపు కమిషన్ పెంపుపై నిర్ణయం తీసుకోకపోతే మద్యం కొనుగోళ్లు ఆపేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్