ఓ వ్యక్తి ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. తన సెల్ ఫోన్, డబ్బులు పోలీసులు తీసుకున్నారంటూ మావుళ్ళు అనే వ్యక్తి ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కాడు. అతడిని కిందికి దింపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.