మర్రి రాజశేఖర్ వైసీపీకి రాజీనామా చేశారు. అయితే, ఈ క్రమంలోనే విడదల రజినీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో తనకు గుర్తింపు లేదని.. చులకనగా చూశారని అన్నారు. వైకాపా నుంచి వెళ్లిపోవడానికి జగనే కారణం అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా.. 2023 చివర్లో ఎమ్మెల్సీ ఇచ్చారని మండిపడ్డారు. ఓడిపోయిన రజినీని మాత్రం చిలకలూరిపేట ఇన్‌ఛార్జ్ చేశారని.. ఆమెను బలోపేతం చేసేందుకు నన్ను అవమానించారంటూ మీడియా ముందు తన గోడును వెల్లబుచ్చారు. త్వరలోనే టీడీపీలో చేరుతానని స్పష్టం చేశారు.