ఆప్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 4.9 తీవ్రతగా నమోదు

64చూసినవారు
ఆప్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 4.9 తీవ్రతగా నమోదు
ఆప్ఘనిస్తాన్‌లో మరో భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్‌ స్కేల్‌పై 4.9 తీవ్రతగా నమోదూనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. ఈ భూకంపం గురువారం అర్థరాత్రి సంభవించడంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదాలు జరగలేదని అధికారులు తెలిపారు. కాగా, మార్చి 13న రిక్టర్‌ స్కేల్‌పై 4.0 తీవ్రతతో ఆప్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్