TG: యూపీఏ ప్రభుత్వ హయాంలో రూ.400కే గ్యాస్ సిలిండర్ పంపిణీ జరిగిందని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సిలిండర్ ధరను రూ.1250 చేశాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలూ నాయక్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామన్నారు. గతంలో పండుగలకు పంపిణీ చేసిన చీరలు పొలాలకు పరదాలుగా ఉన్నాయన్నారు. నాణ్యత లేని చీరలు పంపిణీ చేసి మహిళలను అవమానించారని తెలిపారు.