తాగిన మత్తులో గుడిసెకు నిప్పు పెట్టిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. ఉన్నావ్ జిల్లా సోహ్రామౌ పీఎస్ పరిధిలోని భట్పురాలో మాదకద్రవ్యాలకు బానిసైన ఓ యువకుడు గుట్కా ఇవ్వనందుకు తాగిన మత్తులో గుడిసెకు నిప్పు పెట్టాడు. ప్రమాదం జరిగిన సమయంలో గుడిసెలో ఇద్దరు పిల్లలు నిద్రిస్తుండగా.. వెంటనే గ్రామస్తులు వారిని రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఆ కుటుంబం జీవనోపాధి కోసం నడిపే దుకాణం, ఇల్లు కాలిబూడిదయ్యాయి.