తెలంగాణలోని వాహనదారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భారీ ఊరటనిచ్చారు. గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. రోడ్డు పనులకు టెండర్లు వేసి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40 శాతం పేమెంట్ కూడా సర్కారే భరిస్తుందని అన్నారు. రాష్ట్రం అంతటా మండలాలను అనుసంధానం చేస్తూ ప్రతి గ్రామాలకు మధ్య ఉన్న లింక్ రోడ్లను డబుల్ రోడ్లు చేయబోతున్నామని ప్రకటించారు.