కమీషన్లకు కక్కుర్తిపడి ORRను రూ.7,300 కోట్లకు అమ్ముకున్న చరిత్ర బీఆర్ఎస్‌ది అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం నిర్వహించిన తెలంగాణ అసెంబ్లీ సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు ఏమీ తెలియదని, ఆయనను ముందుంచి వెనుక ఇద్దరు నడిపిస్తున్నారని విమర్శించారు. ORR లీజ్‌లో అవకతవకలతో రాష్ట్రానికి నష్టం వాటిల్లిందని, దీనిపై SIT దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.