మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎస్సీ వర్గీకరణపై ఈ లోగా క్లారిటీ రానుంది. నోటిఫికేషన్‌కు ఎలాంటి అడ్డంకులు ఉండకుండా సాఫీగా నియామకాలు జరగాలనే ఉద్దేశంతోనే ఇన్నాళ్లు నోటిఫికేషన్ విడుదల ఆలస్యమైంది. ప్రభుత్వం 16,247 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి, జూన్‌లోగా నియామకాలు చేపట్టాలని భావిస్తోంది.