ఇరకాటంలో పడ్డ మంత్రి అమర్నాథ్

556చూసినవారు
ఇరకాటంలో పడ్డ మంత్రి అమర్నాథ్
మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ప్రధాని మోడీకే సవాల్ విసిరి ఇరకాటంలో పడ్డారు. ఎన్నికల ప్రచారం కోసం ఉమ్మడి విశాఖ జిల్లాకు రానున్న మోడీ.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయమనే హామీ ఇస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, గాజువాక అసెంబ్లీ బరిలో నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్