ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ బుధవారం సంచలన ట్వీట్ చేశారు. ‘ఇంటి పోరు ఇంతింత కదయా.. ఆరోగ్య శ్రీ పథకాన్ని అనారోగ్య శ్రీగా మార్చారు. ఆస్పత్రులకు రూ.1600 కోట్ల బకాయిలు పెట్టింది గత ప్రభుత్వం. ఇంతకీ ప్యాలెస్‌లో ఏం జరుగుతోంది.’ అంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి మాట్లాడినట్లు తెలుస్తోంది.