వైఎస్సార్ కడప జిల్లా ప్రేమోన్మాది దాడి ఘటనపై మంత్రి సవిత సీరియస్ అయ్యారు. ఎస్పీ విద్యాసాగర్ తో ఫోన్ లో మాట్లాడిన మంత్రి సవిత నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. కాగా, ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ షర్మిల (18) పరిస్థితి విషమంగా ఉన్నట్లు మంత్రికి వైద్యుల వెల్లడించారు. దాంతో బాధిత యువతికి మెరుగైన వైద్య సేవలందించాలని రుమా ఆసుపత్రి వైద్యులను ఆమె ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.