చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా చేనేత కార్మికులకు ఉన్న రుణాలను మాఫీ చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా తాజాగా చేనేత శాఖ రుణమాఫీపై కసరత్తు చేపట్టింది. అందుకు రూ.58 కోట్లు అవసరమని చేనేత శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మేరకు నిధుల విడుదల కోసం ఆర్థికశాఖకు ఫైల్ పంపించింది. ఆర్థికశాఖ ఆమోదం లభిస్తే వెంటనే రుణమాఫీ ప్రక్రియను చేనేత శాఖ చేపట్టనుంది.