ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఇటీవల పాకిస్థాన్‌లోని లాహోర్ నిలిచింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అత్యంత ప్రమాదకరస్థాయి అయిన 708కి చేరడంలో ఈ నగరం తిరిగి అత్యంత కాలుష్య నగరంగా వార్తల్లో నిలిచింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వార్షిక సురక్షిత పరిమితి కంటే PM 2.5 సాంద్రతలు 431 ug/m3-86 రెట్లు ఎక్కువగా ఉండటంతో లాహోర్ నివాసితుల ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడిందని డాన్ నివేదించింది.