కేంద్రం జమిలి దిశగా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి బిల్లు ప్రతిపాదించే అవకాశాలున్నాయి. అయితే మహారాష్ట్రలో విజయం తర్వాత బీజేపీ కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రజల పక్షాన పోరాటం చేసి 2024లో తొలిసారిగా ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా దేశ రాజకీయ పార్టీల దృష్టి పవన్‌పై మళ్లింది. మహారాష్ట్ర, తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పవన్ ప్రభావం కనిపించింది. దాంతో బీజేపీ పవన్‌కు కీలక బాధ్యతలు అప్పజెప్పేందుకు సిద్ధమవుతోంది.