AP: శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బిస్కెట్లు ఆశచూపి ఆరేళ్ల చిన్నారిపై వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ బాలికను సెల్లార్‌లోని ఉన్న కార్ల వెనకకు తీసుకెళ్లి బాలికను తాకుతూ వికృత చేష్టలకు పాల్పడగా.. దీన్ని గమనించిన ఆమె తల్లి అప్రమత్తమై కుమార్తెను కాపాడుకుంది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేశారు. వృద్ధుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామన్నారు.