నాసా ఉద్యోగులు.. అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు పొందే జీతభత్యాలే పొందుతారు. వ్యోమగాములకు జనరల్ షెడ్యూల్ జీఎస్-13 నుంచి జీఎస్-15 కింద చెల్లింపులు ఉంటాయి. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు అత్యధిక గ్రేడ్ జీఎస్-15 గ్రేడ్ పే జీతం అందుకుంటున్నారు. దీని ప్రకారం వార్షిక వేతనం 1,24,133 డాలర్ల నుంచి 1,62,672 డాలర్ల (సుమారు రూ.1.08 కోట్ల నుంచి రూ.1.41కోట్లు) మధ్యన ఉంటుందని సమాచారం.