ఛత్తీస్‌గఢ్‌లోని లోహర్సీలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి బోల్తా పడడంతో 35 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సు శివరినారాయణ్ నుంచి బిలాస్‌పూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.