వైసీపీ నేతలపై మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తీవ్ర విమర్శలు గుప్పించారు. కమీషన్లు తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో జగన్ రాష్ట్ర పరవు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని కామెంట్స్ చేశారు. దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన ఘటనలు వైసీపీ పాలనలోనే జరిగాయని మండిపడ్డారు. జగన్ భ్రమల్లో విహరించడం మాని వాస్తవాలు గ్రహించకపోతే పూర్తిగా పతనమవుతారని ఆయన హెచ్చరించారు