వైసీపీ ఎంపీ పిల్లి సుభాస్ చంద్రబోస్, మంత్రి వాసంశెట్టి సుభాస్ మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. తమ 6 నెలల పాలన.. వైసీపీ ఐదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అంటూ సుభాస్ సవాల్ విసిరారు. జగన్ హయాంలో అవినీతి జరగలేదని బోస్ చెప్పగలరా? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి వేణు, బోస్ వాటాలు పంచుకున్నారా? అని నిలదీశారు. కౌలు రైతుల పేర్లతో క్రాప్ ఇన్స్యూరెన్స్ కూడా మింగేశారని మంత్రి సుభాష్ ఆరోపించారు.