AP: ఏలూరు జిల్లా టి.నర్సాపురం మండలం వెలగపాడులో శనివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను భర్త అతికిరాతకంగా హత్య చేశాడు. భార్య శ్రావణిని (23) కత్తితో మెడపై నరికి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.