TG: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలకుంట కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. 17వ బెటాలియన్ చెందిన ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ.. తన భార్య, ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వారందరికీ ముందు పురుగుల మందు ఇచ్చిన తర్వాత బాలకృష్ణ ఉరేసుకున్నాడు. ఈ క్రమంలో బాలకృష్ణ మృతి చెందాడు. భార్య, పిల్లలను స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.