విమాన ప్రమాదం.. 62కు చేరిన మృతుల సంఖ్య

66చూసినవారు
విమాన ప్రమాదం.. 62కు చేరిన మృతుల సంఖ్య
దక్షిణ కొరియాలోని ముయాన్‌ విమానాశ్రయంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 62కు చేరింది. రన్‌వేపై విమానం అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొని పేలింది. దీంతో భారీగా మంటలు వచ్చాయి. ప్రమాద సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు. ఘటనాస్థలిలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 7C2216 విమానం బ్యాంకాక్‌ నుంచి ముయాన్‌ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్