వరద ప్రాంతాల్లో మంత్రులు పర్యటన

83చూసినవారు
వరద ప్రాంతాల్లో మంత్రులు పర్యటన
పోలవరం విలీన ప్రాంతాల్లో ఏపీ మంత్రులు ఇవాళ పర్యటించారు. కుక్కునూరు మండలం దాచారం పునరావాస కాలనీకి మంత్రులు వెళ్లారు. పునరావాస కాలనీలోని నిర్వాసితులతో మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల, అనిత, కొలుసు ముఖాముఖి భేటీ అయ్యారు. నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పునరావాస కాలనీల్లో రోడ్లు, మరుగుదొడ్ల సమస్య ఉందని నిర్వాసితులు చెప్పడంతో... బయో టాయిలెట్లు ఏర్పాటు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్