ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మ ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 9వ తేదీన ఏపీ మహిళా కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ ఆమె లేఖ సమర్పించారు. ప్రభుత్వం గ్రీష్మ రాజీనామాను ఆమోదిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. జీతభత్యాలు, అలెవెన్స్‌లో కేటగిరి-బీలో ఉన్న ఈ పదవిని పభుత్వం త్వరలోనే భర్తీ చేయనుంది.