టీడీపీలో చేరనున్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్!

74చూసినవారు
టీడీపీలో చేరనున్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్!
AP: వైసీపీ అధినేత జగన్ వైఖరి వల్లే తాను ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తెలిపారు. త్వరలో టీడీపీలో చేరనున్నట్లు వెల్లడించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆయన మాట్లాడుతూ.. 2011లో వైసీపీలో చేరిన తాను ఉమ్మడి గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా పార్టీ అభివృద్ధికి కృషి చేసినా.. అవమానాలే ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. 2019లో ఎన్నికల్లో విజయం ఖాయమనుకున్న సమయంలో మరో వ్యక్తికి సీటు ఇచ్చారని చెప్పారు.

సంబంధిత పోస్ట్