జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే కావాలనుకోవడం తప్పు. ఆయన పుట్టిన రాష్ట్రం వేరు. ఈ రాష్ట్రం వేరు. ఆయన పౌరుషం, కోపం, పట్టుదల ఏమయ్యాయి? అవమానించిన వారి ఇంటికి వెళ్లి భోజనం ఎలా చేస్తారు. మగాడివైతే డైరెక్ట్‌గా నాతో మాట్లాడు.’ అని వ్యాఖ్యానించారు.