ఆదోని: అధిక టికెట్ రేట్లపై చర్యలు కావాలి

75చూసినవారు
రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానున్న నూతన సినిమాలను ఆధికారులు దృష్టిలో పెట్టుకుని బెన్ ఫిట్ షో పేరుతో అధిక ధరలకు సినిమా టికెట్లు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదోనిలో డీవైఎఫ్ఐ నాయకుడు నాగరాజు డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఆదోనిలో మాట్లాడారు. ఈ అంశంపై సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు వినతిపత్రం అందించినట్లు తెలిపారు. టికెట్లు అధిక ధరలకు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్