కూటమి ప్రభుత్వంలో 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. ఆదివారం కర్నూలు జడ్పీ మీట్ లో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు సర్పంచ్‌లు నిధులు జమ చేసుకోవడం దారుణమన్నారు. కొత్తపల్లి జడ్పీటీసీ సుధాకర్ కలగజేసుకుని సర్పంచులపై ఆరోపణలు చేయడం తగదని ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేయగా, చేసిన దుర్మార్గాలు బయటపెడితే ఎందుకు జంకుతున్నారని జడ్పీటీసీలపై ఆగ్రహం వ్యక్తంచేశారు.