ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాల్మీకులకు న్యాయం చేయాలని, ఎస్టీ జాబితాలో పునరుద్ధరించాలని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి కోరారు. శనివారం ఆయన వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ ఢిల్లీలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యురాలు ఆశా లఖడ తో కలిసి మాట్లాడినట్లు తెలిపారు. స్వాతంత్య్రం కంటే ముందు ఎస్టీలుగా ఉన్న వాల్మీకులను స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆకారణంగా ఎస్టీ నుంచి బీసీలుగా మార్చారన్నారు.